అమ్మ: -చెన్నమనేని ప్రేమసాగర్ రావు


 అమ్మాఅని పిలుచుకుంటము 

వున్నప్పుడు 

అమ్మాఅని తలుచు కుంటము 

లేనప్పుడు 

వున్నా ,లేకున్నా 

మనమున్నంత వరకు 

అమ్మ వుంటుంది 

మనమది నిండా 

అమ్మతో అనుబంధం 

యెవరూ దూరంచేయలేరు--!