శకుంతల జననం:-.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 విశ్వామిత్రుడు వసిష్ఠమహర్షితో వచ్చిన వైరంతో,మాలిని నదీతీరంలో, ఆయనవలే బ్రహ్మర్షి కావాలని తీవ్రనియమాలతో మొదటిమాసం ఆకులనే ఆహారంగా,రొండోమాసం నీటినే ఆహారంగా,అనంతరంగాలినే స్వీకరిస్తూ, తపోదీక్షసాగించాడు. ఇంద్రుడు విశ్వామిత్రుని తపోదీక్షఎలాగైనా, భగ్నపరచాలని మేనకను పిలిచి విశ్వామిత్రుని తపోభంగంకావించమని ఆజ్ఞాపించాడు.'ప్రభూ ఆయనకోపం గురించిమీకుతెలియనిదికాదు.బ్రహ్మర్షి వసిష్టులవారి సంతతినే భస్మంచేసారు.తన తపోశక్తిచే త్రిశంకు స్వర్గం నిర్మింపచేసాడు.తను సుఖస్నానంచేయడానికి కౌశకి నదినే తన ఆశ్రమానికి రప్పించుకున్న తపోధనుడు.అటువంటిమహనీయుని తపోభంగంకలిగించాలి అంటే వాయుదేముడు,మన్మధుడు, సందర్బోచితంగా నాకుసహకరించాలి'అంది మేనక ఆమెకోరిన విధంగా వరుణదేవుని,మన్మధుని ఆమెకు సహకరించమని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు.వసంతఋతువు మల్లే,బంతి,చామంతి ,పారిజాత,అశోక, చంపక,మోదుగ పూలు విరియడంతో మాలిని నదీతీరం నందనవనంలా తయారైనది.కోయిలల కుహు కుహు రావాలతో,పూలలోని తేనకై తుమ్మెదల ఝుంకారాలు ,మలయమారుత శీతలపవనాలను వీచసాగాడు వరుణుడు.అదేఅదనుగా తను నయనమనోహరంగా సుమధురగానంతో నృత్యంచేయసాగింది మేనక.ఏకాగ్రత చెదరి కన్నులు తెరచి ఆమెనృత్య గానానికి పరవసించి మైమరచి పోయాడు విశ్వామిత్రుడు.అదేసమయంలో మన్మధుడు తన చెరకుగడ విల్లునుగా చేసుకుని తన అయిదు బాణాలు.అరవిందం, అశోకం,ఆమ్రమంజరి, నవమల్లిక,నీలోత్పలం లను విశ్వామిత్రునిపై ద్రవణ,శోషణ,తాపన, మోహన,ఉన్మాద,విలాసాలకు లోనయ్యేలా ప్రయోగించాడు మన్మధుడు. ఆబాణాలశక్తికి లోనైనవిశ్వామిత్రునికంటికి మేనక భువనైక సుందరిలా కనిపించింది.మోహంతో ఆమెను కౌగిలించుకున్నాడు. కాలంగడచిపోతుంది. మేనకకు ఆడపిల్లజన్మించింది.అప్పటికి తెలిసింది తనతప్పు విశ్వామిత్రునికి.మేనకనువిడిచి ఉత్తరదిశగా బయలుదేరి వెళ్లిపోయాడు.ఆశిశువును మాలినినదీతీరాన చెట్టుకింద వదలి దేవలోకం వెళ్లిపోయింది మేనక.శకుంతలములచే పోషించబడిన ఆశిశువు 'శకుంతల'గాపిలవబడింది.ఆదారిన వెళుతున్న కణ్వమహర్షి తనఆశ్రమానికి తెచ్చి శకుంతలను పెంచాడు.ఆమె దుష్యంత మహారాజు ఆమెను వివాహం చేసుకుని భరతునికి జన్మనిచ్చింది.