అమ్మాయిలు : - కవిత వేంకటేశ్వర్లు

 అమ్మాయిలు అవనికి అందం
అతివలు ఆనందాల బంధం
ఉవిదలు ఉర్వికి వెలుగులు
ముదితలు ముక్తి కారకులు
కాంతలు కళ్యాణ మూర్తులు
మగువలు మహనీయులు
కన్యలు కరుణామయులు
వనితలు వంశ వృద్ది కారకులు
అంగనలు అమృతమూర్తులు
పొలతలు ప్రేమైక్యమూర్తులు
నెలతలు వెన్నెల దీప్తులు
తన్విలు తరళ మనస్కులు
లేడీస్ లేడికి ప్రతీకలు
ఉమెన్స్ ఉల్లాసం నింపేటోళ్లు
ఊహల్లో విహరింపఁజేసేటోళ్లు
ఉద్వాహనికి ఉసిగొల్పేటోళ్లు!!