ముందు చూపు ..!!:------డా .కె.ఎల్వీ--హనంకొండ.


 బడికి వెళ్ళలేను 

బడిమానలేను 

అయోమయంలో 

నేను .....

ఇంట్లొనే ఉంటాను !


ఇంటిబడి అంటే 

ఆన్లయిన్ బడి 

కొత్తరకం బడి 

కరోనా కల్పించింది !


మొబైల్ -టాబ్ ...

లేదా ..లాప్టాప్ ...

ఉంటేచాలు .....

అందులోనే బడి 

అందులోనే టీచర్లు 

అందులోనే విద్యార్థులు 

అందులోనే --

అమ్మలూ -నాన్నలూ  !


కొత్తరకం బడి 

ఇప్పటి ఈ ఇంటిబడి 

రేపటి --

వర్క్ ఫ్రమ్ హోమ్ కి 

ఇదేమరి --

గట్టిపునాది ....!


హే ...కరోనా ...

ఎంతైనా నీది ...

ఎంతో--

 ముందుచూపు సుమా ..!!

----------------------------------

ఫొటో లో---బేబీ ఆన్షి.నల్లి.