ఏడడుగుల బంధం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 మనసులు కలిసిన వేళతో

మొదలైన మన బంధమూ

మురిసి విరిసిన ఆనందమూ

ఏ వేళ పిలిచినా పలికేవూ

||ఈనాటి మనబంధం‌ ఏనాటిదో||


కలిసి మురిసాము మనమూ

తెలిసి కలిసాము గమ్యమూ

నీవే నేనని,నేను నీవని తిరిగామూ

కళ్యాణ బంధంతో ముడిపడ్డామూ

||ఈనాటి మనబంధం ఏనాటిదో||


ఎన్నో జన్మల పుణ్యఫలమూ ఫలించి

బందీలమయ్యాము మనమూ

ఈ జన్మలో కలిసి సాగేమూ

అందాల మకరందాల జీవితమూ

||ఈనాటి మనబంధం ఏనాటిదో||


ప్రాణమొక్కటై వలపుల తలపులు తెరిచామూ

గానమొక్కటై చిలిపికోర్కెలు తీర్చుకున్నామూ

నడకొక్కటై బహుదూరం కలిసి నడిచామూ

ఇద్దరమొక్కటై అంతిమయాత్రకు పోదామూ

||ఈనాటి మనబంధం ఏనాటిదో||


జన్మజన్మలకు మనమే తిరిగి పుడుదామూ

నీవూ నేనూ మనమై ఎప్పటికీ ఉండిపోదామూ

అనుబంధాల ఆవాసాలమై నిలిచిపోదామూ

మన ఆశల ఊసులు మళ్ళీ మళ్ళీ తీర్చుకుందామూ

||ఈనాటి మనబంధం ఏనాటిదో||