అ ఆ ఇ ఈ వ్రాసిచ్చి
దిద్దిన ఇచ్చే అప్పచ్చి
అమ్మే నాకు తొలి గురువు
ఆడుతు పాడుతూ నేర్పేచదువు!
ఒకటీ రెండూ అంకెలనూ
సుమతీ శతకం పద్యములూ
రోజూ నేర్పి ఇష్టంగా
బడిలో ఇంక కష్టంలేదుగా !
కాకీ పిచ్చుక కథలెన్నో
కాశీ మజిలీ కథలెన్నో
నీతి చంద్రిక చెప్తుంది
జాతిని మరువకు అంటుంది!
అమ్మే నాకు గురువు ( బాల గేయం)-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి