రణపాల మొక్క(Bryophyllum) ఔషధ గుణాలు..: - పి . కమలాకర్ రావు

  రణపాల మన శరీరంలోని రాళ్లను కరిగించే శక్తి గల మొక్క. ఇది త్రిదోష హారిణి. పొత్తికడుపులో శుద్ధి చేస్తుంది.  కడుపులో పుళ్లను. కాకుండా చూస్తుంది. ఇది మూత్ర దోషాలను సవరిస్తుంది
 కొన్ని రణపాల ఆకు లను శుభ్రంగా కడిగి ముక్కలుగా తుంచి నీటిలో వేసి మరిగించి కొద్దిగా జీలకర్ర పొడి తాటి కలకండ కలిపి చల్లార్చి త్రాగాలి మూత్రపిండాలలోని రాళ్లు గాల్ బ్లాడర్ లోని రాళ్ళు దీనితో కరిగిపోతాయి. అందుకే సంస్కృతంలో దీన్ని పాషాణభేది అని అంటారు.
దీని ఆకులను ముద్దగా నూరి ఆముదం లో వేయించి, పొత్తికడుపు పై పూతగా రాస్తే మూత్ర అవరోధం  తొలగిపోతుంది. మూత్రం ఫ్రీగా వస్తుంది.
 రణపాల ఆకు రసం లో మజ్జిగ ఉప్పు కలిపి త్రాగితే మలద్వారంలో జరిగే రక్తస్రావం ఆగిపోతుంది. రక్త విరేచనాలు కూడా తగ్గిపోతాయి
కనుగ్రుడ్డు లో నొప్పి వస్తే రణపాల ఆకు రసం కంటిచుట్టూ రాయాల. ఆకు రసం కంటిలోకి పోకూడదు. కంటిలో నొప్పి తగ్గిపోతుంది. తలనొప్పి లో కూడా దీని ఆకు రసం పూసుకుంటేతగ్గిపోతుంది. చిన్న పిల్లలకు కడుపు నొప్పి వస్తే రణపాల ఆకు కషాయం లో చక్కెర వేసి త్రాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. పెద్ద వారికి కడుపు నొప్పి వస్తే దీని ఆకుల రసం లో శొంఠి  పొడి కలిపి త్రాగాలి.
 దీని ఆకుల కషాయం త్రాగితే మూత్రంలో మంట కూడా తగ్గిపోతుంది.
రణపాల ఆకు ల ముద్దలో కొబ్బరి నూనె కలిపి పై లంగా కాచి కాలి ఆనెలకు పూసుకుంటే ఆనెలు తగ్గిపోతాయి. ఇదే తైలం పుళ్లకు  మందుగా కూడా పనిచేస్తుంది.
 రణపాల ముదిరిన ఆకులను మట్టిలో పెడితే మళ్లీ మొలకలు వస్తాయి. దీనిని కుండలలో పెట్టి పెంచుకోవచ్చు.