జీవుల్లో ఇంటెలిజెన్స్ ఎలా పుట్టింది!?: - ప్రతాప్ కౌటిళ్యాM.sc. (Bio-Chem)M.tech (Bio-Tech)

 జీవ పరిణామ క్రమంలో జీవులు బలహీనమైన వి అంతరించిపోయి బలమైనవి కొనసాగుతున్నాయి. జీవులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది అది ఇంటెలిజెన్స్, జీవ జాతిలోనే అతి అరుదైన మానవ జాతి గా మన గలుగుతున్నాడు మనిషి. అతని ఇంటలిజెన్స్ విశ్వంలో మరే గ్రహంలో కానీ మరి ఎక్కడ కానీ మనిషి కనిపించలేదు అన్నది నిజం.
బ్రెయిన్ యొక్క ముఖ్యమైన విధి విధి నిర్వహణ శరీరం శరీరావయవాల నిర్వహణ మాత్రమే, అందు కోసం మాత్రమే జీవుల్లో మెదడు ఏర్పడింది. అది మాత్రమే మెదడు ప్రధానమైన బాధ్యత విధి, కొన్ని భౌతిక పరిస్థితులకు శరీర అంతర్గత బాహ్య శరీర మార్పులకు అనుకూలంగా అననుకూల పరిస్థితులకు లోనై మెదడు స్పందించే విధానం పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఉంటుంది. ప్రధాన బాధ్యత అయినా శరీర విధినిర్వహణ మాత్రమే కాక బహిర్గత మార్పులకు లోనై మెదడు కొంత కొత్త విధి నిర్వహణకు లోనయింది. మెదడు శరీరానికే పరిమితం కాకుండా కొత్తగా మేధస్సు అవేర్నెస్ నైపుణ్యాలను విస్తృత పరచుకున్నది దాన్ని మనం ఇంటెలిజెంన్స్ అంటున్నాం ,ఇది జంతు జాతి అంతటా ఉంది .
ప్రారంభంలో జీవులు మనుగడ కోసం మాత్రమే మేధస్సును ఏర్పరచుకున్నాయి. సార్ ఈ రకంగా బలమైనది ఈ భూమ్మీద నిలదొక్కుకున్న వి మేధోపరంగా అభివృద్ధి చెందిన జీవులు శారీరకంగా బలమైన వాటిని శాసించిన ట్లు గమనిస్తున్నాం. ఒక జీవి మరో జీవిని బెదిరించాలి అంటే మనుగడ కోసం ముందుకు సాగాలంటే ఆ పోటీలో అవేర్నెస్ అంటే మేధస్సు అవసరం ఏర్పడింది. జీవుల్లో కొంత కొత్తగా జీవించే నైపుణ్యం ఏర్పడి ఉంటుంది. ఎదుటి జీవిని ని ఎదిరించి ముందుకు సాగే నేర్పును ఏర్పరచుకొని ఉండాలి. మోసం చేయటం కావచ్చు నేర్పు కావచ్చు దాన్ని మనం ఇంటలిజెన్స్ అంటున్నాం.
జీవుల్లో ఇంటలిజెన్స్ కు ముఖ్య కారణం పోరాటం. ఆహారం కోసం రక్షణ కోసం పునరుత్పత్తి కోసం మనుగడ కోసం మాత్రమే ఏర్పడిన అవేర్ నెస్ నైపుణ్యాలు ఇంటెలిజెన్స్ గా మారింది. అంతకు ముందున్న అన్ని జీవులలో ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే కొనసాగింది. తర్వాత తరంలోని జీవుల్లో అది కాస్త మార్పు చోటు చేసుకుంది మనుగడ కోసం పునరుత్పత్తి కోసం అవి అవేర్ నెస్ ను కొన్ని వ్యూహాలు గా మార్చుకొని ముందుకు సాగింది. అదే ఇంటెలిజెన్స్ గా మారింది. ఏదో అద్భుతం జరిగి మనిషి మహామేధావి గా మారలేదు ఈ పరిణామ క్రమంలో చాలా మార్పులకు గురై జీవులలోని వారసత్వానికి అనుగుణంగానే మనిషి పుట్టిన తర్వాత తన రక్షణ కోసం ప్రత్యుత్పత్తి కోసం మనుగడ కోసం ఆహారం కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలను రూపొందించుకుని  ఎదురించి పోరాడి నిలబడ్డాడు ఈ భూమ్మీద అందుకు కారణం అతని వారసత్వపు ఇంటెలిజెన్స్. అదే ఇంటెలిజెన్స్ మనిషి కొత్తగా ఆలోచించడానికి కారణమైంది.