ఆర్వీయం Sunshine-4: ----శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆష్ట్రేలియా .


 ఏడవబోయే ముందు బిగించే నీ చిట్టి పెదాలు

ఏ తియ్యటి చక్కెరకేళీలు వాటికి సరితూగవు

మరులుగొలిపే ఆ పెదాల బిగింపు కోసం

గిల్లి మరీ ఏడిపించేరు నీ అక్కలు..!


సర్జరీ నుండి సగంలోనే మమ్మీ

ఆఫీసు నుండి ఆఘమేఘాల మీద పప్పా

స్కూలు నుండి పరవళ్ళు తొక్కుతూ అక్కలు

సందెపొద్దున చుట్టుముట్టేరు కేరింతల నిన్ను..!


నీ తియ్యని నవ్వు అందరి అలసటకు మందు

నీ కోమల ముఖారవిందం డెలీషియస్ విందు!

ఇంటిల్లపాదికి కావాలి నీ మురిపాల పొందు

నువ్వు నిదురించే వేళ విశ్వమే నిశ్శబ్దం చెందు..!!

 -----------------------------------------------------

ఫోటో లో----అమ్మమ్మ తో...బేబీ ఆర్వీ సంధు ఆస్ట్రేలియా.