ఆర్వీయం Sunshine-5:-----ఝాన్సీ.కొప్పిశెట్టి --ఆస్ట్రేలియా


 గుడియా లాంటి నా పంజాబీ కుడీ

చిన్ని సున్నా నోటి చిట్టి సంపంగీ 

నవరసాలొలికే నీ పసి భాషా ధ్వనులు

నీ కళ్ళలో  తొణికిసలాడే హావభావాలు

మూడు నెలల మహానటివేలే నువ్వు..! 


విక్రమార్కుని భుజంపై బేతాళుడిలా

నా భుజంపై చీరకొంగులా అనునిత్యం వేలాడుతూ

నిలవని తలతో కొండపల్లి బొమ్మలా కదులుతూ

తిరిగి తిరిగి నా మొహం వైపు చూస్తూ..!


పీ..క..బూ ల దోబూచులాటలో

నేను కళ్ళు తెరిచిన ప్రతి ఘడియ

బోసి నోటితో చిగురు నవ్వు నవ్వుతూ

చిత్తయ్యే నవ్వుతో నక్షత్రాలు రువ్వుతూ..!


      ---------------------------------

ఫోటోలో----అమ్మమ్మతో...ఆర్వీ సంధు.