ఆర్వీయం Sunshine-9: ----ఝాన్సీ.కొప్పిశెట్టి ఆస్ట్రేలియా.


 పాలు తాగే నీకెన్ని ఆరిందా పెత్తనాలో

అక్కల అరుపులకు ఆపి మరీ ఆలోచిస్తావు

పప్పా కారు హారనుకి చెవులు నిక్కిస్తావు

కనుపాపలను చుట్టూ కలయతిప్పి చూస్తావు..!


బూరె బుగ్గల నా బుజ్జి కొండా

ఐదో మాసంలోనే బోర్లాపడి 

బొబ్బట్ల పరీక్ష పెట్టావు

నాతో తెలియని పిండి వంట చేయించావు

గూగుల్ లో గింగిరాలు కొట్టించావు..!

 ---------------------------------------

ఫొటొ లో---:బేబీ  ఆర్వీ సంధు.