బతుకమ్మ (మణిపూసలు):-పొట్టోల్ల లహరి-10వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816
బతుకమ్మ వచ్చేను
సంబరాలు తెచ్చెను
చిన్న పెద్దలంత కలిసి
గౌరి పూజచేసెను

వేకువనే లేచాము
అడవిలోకి వెళ్ళాము
పువ్వునంత తీసుకొచ్చి
వేరు చేసి పెడతాము

అందరము చేరుతాం
పువ్వంత తెంపుతాం
కట్టలేన్నొ కట్టియు
బతుకమ్మ పేర్చుతాం

వాడలందు నిలుపుదాం
పాటలెన్నొ పాడుదాం
పాడినంక తీసుకొని
చెరువులోన వేయుదాం

వయనాలను పంచాము
ఫలహారము తిన్నాము
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించి పోయాము


కామెంట్‌లు