భగత్ సింగ్:-పి. సుహాసిని,-10వ, తరగతి,ZPHS దుప్పల్లి.
భగత్ సింగ్ వీరుడు
భయపడని ధీరుడు

దేశమే ఆయన ఊపిరి
ఏదేమైన పోరాటమే సలిపిరి

తిరుగుబాటు చైతన్యం
తిరుగులేని గుండెధైర్యం

దేశంకోసమే ఉద్యమం
దేహమంతా ఉత్సాహం

తెల్లోడి గుండెల్లో సింహస్వప్నం
తెగువతో న

డిపించే 
స్వతంత్ర సమరం

భరతమాత ముద్దుబిడ్డ
బలియైపోయిన పోరుబిడ్డ

ఆయన అందరికీ ఆదర్శం
నడవాలందరం ఆయన చూపిన మార్గం