మా అమ్మనాన్నలకు
అక్కా నేను రెండుకళ్ళు
మా అక్కంటే తల్లో నాలుకై
అందరిలో కలిసిపోతుంది
చదువులోకూడా తెలివైనదే
అక్కెంత అల్లరిచేసిన
భరించాల్సింది నేనే
ఆమే కంఠం కంచు కంఠం
నాదేమో మౌన వ్రతం
అయినా అక్కంటే నా ఆదర్శం
తనేంచేసిన నాకు దారై నిలుస్తుంది
ఆడపిల్లలమైన మాకు ధైర్యమెక్కువే
ఎందుకంటే అమ్మనాన్నలు మమ్మల్ని గమనిస్తనేవుంటరు
ఆనందం మా ఇంటిలో నివాసముంటదీ
నేస్తాల అభయం
గురువుల ఆశీర్వాదం
మాకెపుడు తోడు నీడ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి