సూర్యోదయం:-ఈశ్వరమ్మ,-10 వ, తరగతి,ZPHS దుప్పల్లి.

 సూర్యోదయం మనందరికి నవోదయం
నవోత్సాహం మనసునిండగా
తనువంత ఉత్సాహం పొందగా
నిన్నటి పనులను వేగంగా పూర్తిచేసేందుకు
ఈరోజు పనులేవున్నా మొదలెట్టేందుకు
రేపటికై ప్రణాలికను రచించేందుకు
మనందరికిది విధాత ఇచ్చిన కొత్తదినం
వర్తమానమెగా మనిషిని విజయతీరాలవైపుకు నడిపేది
వదులుకోవద్దు వర్తమానాన్ని
వర్తమానమంటే మనం బతుకున్నట్టు
వర్తమానమంటే జీవనగమనం
వర్తమానమెపుడు భవిష్యత్తుకు పునాది
అందుకే
బలంగా నిర్మించాలి పునాది
నీవనుకున్న మేడను నిర్మించేందుకు


కామెంట్‌లు