వారానికి ఒక్కరోజు జరిగే సంత
మా ఇంటినిండుగా సరుకులతో నింపేస్తుంది
సంతకోసం ఆటోరిక్షాలో వెళ్ళి
ఒక్కసారి కలయజూసి
కంటికి నచ్చిన కూరలనన్నీ
కూరగాయలనన్నీ
మంచిగున్నవన్ని చకచకా కొనేసి
సంచిలో దాచేయడమే
సంతలో దొరికేవన్నీ
రైతన్నల కష్టం
మోసం లేదక్కడ మొహమాటం తప్ప
సంచి అమాంతం నిండిపోతుంది
మోతెంత బరువున్న బారమనుకోకుండా బేరమాడి
అడుగుతీసిఅడుగేయాలేని జనసందోహం
సంత కమ్మదనమే వేరు
సంతను దర్శించకపోతే
ఆ వారమంతా రుచులు సగంసగమే
సంతలోనే వుంది సంతోషం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి