సులక్షణ మహారాజు వృత్తాంతము
వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి దాని నివారణోపాయం చేసెడివాడు. సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ, యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమి లాభం?
“అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్రసంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా! కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను.
ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను – “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధీశుడను. నా పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు. అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగలేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లోనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. “రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా – పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైననూ చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి వుండేది. గాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్రసంతతి కలుగలేదు.
ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్రసంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు” అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలహే జీవిమ్పజేయుము” అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని యింటికి వెళ్ళిపొయినాడు. భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి “భోజనానంతరం సేవిమ్పుడు” అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరచి తానూ భోజనశాలకు పత్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించెదనని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియు ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి