కందము :
*అందరు సురలును దనుజులు*
*పొందగ క్షీరాబ్ధి | దరవ పొలుపున నీ వా*
*నందముగ కూర్మరూపున*
*మందరగిరి యెత్తితౌర | మాధవ కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
మౌనము, ధ్యానము, యోగము అను వీనిచే పొందదగిన వాడవు మాధవా!! అట్టి నీవు లక్ష్మీ దేవికి నాథుడవు కూడా కదా!! రాక్షసులు, దేవతలు పాలసముద్రం మధించుతున్నప్పుడు, తాబేలు రూపంలో మందర పర్వతాన్ని వీపున మోశావు. నీ నేర్పరితనము ఇంకొకరికి శక్యమా.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి