కందము :
*దశకంఠుని బరిమార్చియు*
*కుశలముతో సీత దెచ్చి | కొనియు నయోధ్య*
*న్విశదముగ కీర్తి నేలితి*
*దశరథరామావతార | ధన్యుడ కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
పరపాత్పరా, నీవు దశరథ మహారాజు కు కొడుకుగా శ్రీరాముడు గా పుట్టి, దశకంఠుడు అనిపించుకున్న రాముని చంపి, సీతతో అయోధ్యకు వచ్చి, చిరకాలమూ కీర్తికాంత నిన్ను వరించేటట్టుగా పరిపాలన కొనసాగించావు....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధూ, నీవు సకల శుభాలకు ఆలవాలమై కూడా, శ్రీరాముడిగా, మానవుడిగా పుట్టి మనిషైనవాడు ఎలావుండాలో చూపించిన ఆదర్శమూర్తివి*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి