కందము :
*దుష్టుండ ననాచారుఁడ*
*దుష్టచరిత్రుఁడను చాల | దుర్భుద్ధిని నే*
*నిష్ఠఁ నిను గొల్వనేరని*
*కష్ఠుఁడ ననుగావు | కరుణను కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
నేను చెడు నడవడిక కలవాడిని. ఏవిధమైన ఆచార పద్ధతులు పాటించని వాడిని. ఎల్లప్పుడూ చెడు ఆలోచనలు చేస్తూ, చెడ్డ పనులు చేసే వాడిని. ఒక పద్ధతి ప్రకారం, నియమంతో నిన్ను పూజించలేని వాడిని. ఇటువంటి నన్ను, కరుణా మూర్తి వైన నీవు మాత్రమే రక్షించ గలవు. దయచేసి, కరుణ జూపి నన్ను ఉద్ధరించు కృష్ణా!!! ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి