ఆటలు:-పడిగెభావన-7వ, తరగతి -ZPHS గుర్రాలగొంది -జిల్లా సిద్దిపేట-చరవాణి:9704865816

 మా ఇంటి పక్కన
ఆటస్థలముఉన్నది
అందులోన మేము
ఆటలే ఆడుతాము 
ఆటలంటే మాకు 
చాలచాలా  ఇష్టము
మట్టిలోన ఆటలంటె 
మహామహా ఇష్టం
కబడ్డీ కోకో 
దొంగ పోలీస్ ఆటలు
అందరము కలిసి మేము 
ఆడుకుంటాము 
మా తోటి పిల్లలను
పిలుచుక వస్తాము
ఆడుకుంటే మాకెంతో
ఆనందం కలుగును
ఆడుకుంటే మాకెంతో
అలసట తీరును 
ఆడుకుంటే మాకెంతో
బలమే వచ్చును 
ఆడుకుంటెమనసుకు
సంతోషంకలుగును
రోజు ఆడుతుంటే
నొప్పులే పెట్టవు
ఆటల పోటీలు పెడితే 
బహుమతులు గెలుస్తాము
మేమంత రోజు
ఆడుతాము
ఆరోగ్యంగా ఉంటాము
చక్కగ బడికి వెళ్లుతాము
చదువులన్నిమేము
చదువుతాము

కామెంట్‌లు