ఇష్టం :--సత్యవాణి--8639660566

 మా అమ్మంటే నాకిష్టం
మానాన్నంటెే మహయిష్టం
 మాఅమ్మానాన్నలటే మరీ మరీ ఇష్టం
మా అక్కంటే నాకిష్టం
మా అన్నంటే మహ ఇష్టం
మా అక్కా అన్నా అంటే
మరీ మరీ ఇష్టం
మా అవ్వంటే నాకిష్టం
మా తాతంటే మహ ఇష్టం
మా అవ్వా తాతా అంటే
మహామహా ఇష్టం
మా బడి అంటే నాకిష్టం
బడిలో గురువులు మహ ఇష్టం
 బడిలో గురవు చెప్పే పాఠాలంటే
మహా మహా ఇష్టం


మా ఇల్లంటే నాకిష్టం
మా ఊరంటే మహ ఇష్టం
మా ఇల్లన్నా మా ఊరుంన్నా
మహా మహా ఇష్టం
నా దేశం అంటే నాకిష్టం
నా ప్రజలంటే మహ ఇష్టం
నా దేశ వేష భాషలు మరీ మరీ ఇష్టం
నా దేశ సంస్కృతి నాకష్టం
సాంప్రదాయాలు మహఇష్టం
నా దేశ ఆచారాలంటే మహా మహా ఇష్టం