జాగ్రత్తగ ఉండండి
కరోనా వైరసండి
చేయి చేయి కలపవద్దు
మాస్కును ధరియించండి
పెన్నుచేత బట్టురా
పేపరుపై రాయరా
పద్యాలనువ్రాయగ
తెలుగుసారుమురిసెరా
రోజు బడికి వస్తాను
చక్కగాను ఉంటాను
సార్లు చెప్పిన పాఠాలు
శ్రద్ధగాను వింటాను
వర్షాలెన్నొ కురియాలి
పంటలు బాగా పండాలి
పచ్చని పొలాలనే
రైతునుచూసి మురవాలి
తెలుగు భాష మధురము
దాన్ని నేర్వఇష్టము
అందులోనితీపినే
అందరికీ పంచుదాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి