కొంత భయముండాలి (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432
అందమైనదీ ప్రపంచము
అందులొఉంది మహత్యము
విచిత్రమైనది జీవితము
మలుపులు తిరిగేప్రయాణము

బ్రహ్మరాత బహుసుందరము
వీక్షించును కద ప్రతి క్షణము
నువ్వున్నావను ఈ ధైర్యం
మరిపించునుకద తనగమ్యం

ఏదో తెలియని వింతభయం
మరిపించును కద ఆ గమనం
గుండెచిన్నది పసిహృదయం
ఉండవలెను కద కొంతభయం

ప్రపంచమెరుగని చిరుహృదయం
ఒలికించెను ఈ సుస్వరం
నవరసాల కళ జీవితం
కొందరిసొంతం ఇదినిజము



కామెంట్‌లు