నీతి పద్యాలు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554635.
67.ఆ.వె. ప్రాణికోటి యందు భగవంతుడుండును
                హింస వలదు వాటి   హితమె తప్ప
                భూతదయగలిగిన బుద్దుని స్మరియింపు
                రమ్య సూక్తులరయు రామకృష్ణ .

68.ఆ.వె. ఆడపిల్ల యనుచు నల్లాడి పోదురు
               మగ శిశువు గలుగ నెగసి పోవు
               ఆదిశక్తి గూడ యాడది కాదొకో
               రమ్య సూక్తులరయు రామకృష్ణ.

69.ఆ.

వె. ఇష్టమైన చదువు నింపు గొలుపు నీకు
               దానిపైన నిలుపు  తగిన శ్రద్ధ
               మంచి కొలువు దొరికి మించిపోయెదవుగా
               రమ్య సూక్తులరయు రామకృష్ణ.

కామెంట్‌లు