లాలి బాలుడు (లాలి పాట):- బెలగాం భీమేశ్వరరావు--9989537835
ఆనందమియ్యిరా! హాయినీ ఇయ్యిరా!           
నీ సేవ చేసేటి భాగ్యమును ఇయ్యిరా/             
చిన్ని నా కన్నరా! బుజ్జి నా కన్నరా!                  
నిను ముద్దు చేసేటి అదృష్టమియ్యిరా!           
నీ చూపుచాలురా! నీ నవ్వు చాలురా!
నీ బాల్యచేష్టలు చూచు వరమియ్యిరా!      
నీ స్పర్శ చాలురా నీ ఊసు చాలురా!                
నీ తోను ఉండేటి సౌఖ్యమును ఇయ్యిరా!
దైవస్వరూపుడవు వంశోద్ధారకుడవు!
శ్రద్ధతో నిను జూచు కానుకను ఇయ్యిరా!
పొత్తిల్లలో పెట్టి పరవశించెదను!
నును బుగ్గలు చూసి మురిసిపోవుదును!
నావంక చూసి నువు నవ్వుతూఉండురా!    
ఆనందలోకాన విహరింప జేయురా!
కిలకిలా నవ్వురా గలగలా నవ్వురా!
నీ కనుల కాంతిలో దైవమును చూపురా!



కామెంట్‌లు