విన్నారా ..విన్నారా ...
ఎపుడైనా కన్నారా ...
వేసవిలో అందివచ్చే
చల్లదనం గుర్తుకు తెచ్చే
గడ్డకట్టిన మంచుముద్దల్లా
కనిపించి -నోరూరించే ,
ముంజెలు ...
తాటిముంజెలు ...
చల్లని ముంజెలు ...
కమ్మని ముంజెలు ....
వేసవివేడిమికి ...
చల్లనిసమాధానం
ఈ తాటిముంజెలు !
పల్లెల్లో .....
తాటి తోపుల్లో నేకాదు
అమ్మకానికి
అన్నిచోట్లా లభించే ..
సామాన్యుడి కి సైతం
చల్లని విందు ...
వేసవిలో కనువిందు !
ఈ ముంజెలు --
జుర్రుకోవడం తెలిస్తే ,
బహుపసందు ...
కన్నుల్లా వోలిస్తే
ఒక్కసారే గుటుక్కు ...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి