నడవలేని, కదలలేని 80 ఏళ్ల వృద్ధుడు. అనారోగ్యంతో బాధపడుతూ మసీదులో-ఆకలి... ఆకలి అని అరుస్తూ, ఏడుస్తూ ఉన్నాడు. ఈ సంఘటన మా అమ్మగారు ఊరు కొండాపూర్ లో జరిగింది. అక్కడ ఎందరో నిలబడి చూస్తూ ఉన్నారు. కానీ, పిడికెడు అన్నం పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడు నా వయస్సు ఎనిమిది సంవత్సరాలు. మా అమ్మతో ఈ సంగతి చెప్పి-అమ్మ నాకు కంచంలో కొంచెం అన్నం పెట్టి ఇవ్వు. నేను ఆయనకు తినిపించి వస్తాను అన్నాను. అక్కడంతా ఆ పెద్దమనిషి అశుభ్రంగా చేశాడు. ఎవరు ధైర్యం చేసి ముందుకు వెళుతలేరు. పిల్లవాడివి నువ్వు ఎందుకురా అన్నం తీసుకెళ్తావ్. భయపడతావ్ రా అన్నది. నాకేమీ భయం కాదు నేనే తినిపిస్తా అన్నాను. మా అమ్మ అ కొంత అన్నం పెట్టి, అందులో కూర కలిపి ఇచ్చింది. నేను వెళ్లి స్వయానా తినిపించి, నీళ్లు తాగించి, మూతి కడిగాను. రెండు చేతులతో ఆ పెద్దమనిషి నాకు దండం పెట్టాడు. ఈ సంగతి ఇప్పటికీ.... అప్పుడప్పుడు మా అమ్మ జ్ఞాపకం చేస్తుంది.
జ్ఞాపకం చేస్తుంది:- ఎన్నవెళ్ళి రాజమౌళి - కథల తాతయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి