కల్పవృక్షం:-- యామిజాల జగదీశ్
మళ్ళీ వచ్చింది
మహిళా దినోత్సవం
ఏటా వస్తూనే 
ఉంటుందీ దినోత్సవం

నిర్విరామంగా
స్త్రీ అడుగుతూనే ఉంది
ఇంకొన్ని హక్కులను
సరిసమాన హక్కులను

ఇస్తామని చెప్పినవాళ్ళూ
ఇచ్చేసేమని చెప్పిన వాళ్ళూ
వింటున్న స్త్రీలుంటూనే ఉన్నారు

కానీ
అడుగుతూనే
ఉండాల్సి రావడాన్నిబట్టి
ఇచ్చామన్న హక్కులు
ఏమేరకు
ఏ పరిధిలో ఉన్నాయో
ఇచ్చామన్న వాళ్ళకే 
తెలియాలి

పొందామనుకుని
నటించడంతోనే
సరిపోతోంది స్త్రీకి....

ఐనా 
హక్కులకతీతంగా
సాధనలతో 
సమాజంలో 
పది మంది దృష్టిలో
చరిత్ర పుటలకెక్కడానికి
స్త్రీ కల్పవృక్షమని
అభివర్ణించే వారు 
ఉంటూనే ఉన్నారు

ఏదైనా
ఎవరెన్నన్నా
స్త్రీ లేనిదే
స్త్రీ తోడు లేనిదే
ఇసుకరేణువూ
కదలదన్నది
తేటతెల్లమే!!