సోమరి కాకి (కథ ) బెల్లంకొండనాగేశ్వరరావు .చెన్నయ్ .


 అమరవతినగరంలో అటవీ శాఖఅధికారిగా పదవివిరమణ చేసిన రాఘవయ్యతాతయ్య ఇంటిఅరుగుపై ఆదివారం కావడంతో ఆవీధీలోని పిల్లలుఅందరు చేరి కథచెప్పమని అడిగారు.పిల్లలుఅందరికి మిఠాయిలు పంచి"న తాతయ్య "బాలలు పుట్టుకతో సహజంగా  మనకువచ్చేజాలి,దయ,కరుణ,వంటివాటితొపాటు దానగుణం,సేవాభావం వంటిగొప్ప సుగుణాలు మీరుఅలవరుచుకోవాలి తల్లి తండ్రులను పెద్దలను గౌరవిస్తూమీరు ఉన్నతవిద్యలు నేర్చి మీవారికి మనదేశానికి మంచిపేరు తీసుకురావాలి ,సోమరితనంఎంత ప్రమాదమో తెలిసేలా ఒ కధచెపుతాను వినండి,ఈ సృష్టిలో జన్మించినప్రతిప్రాణి కష్టించి తన ఆహారం సంపాదించుకొవాలి అదిప్రకృతి ధర్మం యిదిప్రతిప్రాణి అనుసరించితీరవలసిందే.తాడికొండ అనే గ్రామంలోని ఓయింటి వేపచెట్టు కొమ్మలమధ్య కాకిజంట గూడుకట్టుకు జీవిస్తున్నాయి . ఒక సారి వచ్చిన గాలివానకు ఆచెట్టుకొమ్మఒకటి విరిగి చెట్టునుండి విడిపోకుండా ఆయింటి ప్రహరిగోడపైఒరిగి ఆగిపోయింది.ఆప్రహరిగోడమీదుగా చెట్టుకొమ్మపైకి పిల్లి తములేనిసమయంలో తమ పిల్లకు ప్రాణహని తలపెట్టేఅవకాశం ఉన్నప్పటికి కాకిజంటకు ఓచిన్నకాకిపిల్లఉండటంతో అదిఎగురలేదుకనుక తమగూటిని మరో చెట్టుపైకిమార్చలేకపోయాయి. ఆయింటి ఇల్లాలు ప్రతిరోజు వంటముగించిన వెంటనే కొద్దిగా ఆహరాన్ని ఆకులో ప్రహరిగోడపైన ఉంచేది .ఆ ఆహరాన్నితమపిల్లకుపెట్టి కాకులురెండు ఆహర అన్వేషణలో బయలుదేరివెళ్ళేవి,అలాతినడం సోమరిగామారి నిద్రపోసాగింది కాకిపిల్ల.తనసహజత్వాన్నిమరచి ఎగరడంకూడా నేర్వకుండా.కొద్దిరోజులు గడిచాక సంభవించిన తుఫానులోప్రయాణిస్తూ దారిలో చిక్కుకుని పెద్దకాకులురెండు మరణించాయి.తమపెద్దలుతెచ్చిపెడితే తినడానికి అలవాటు పడిన కాకిపిల్ల మరుదినం పెద్దలురాకపోవడంతో ఆకలిబాధకు నెమ్మదిగా గూటిలోనుండికొమ్మ మీదుగా ప్రహరగోడపైకి నడుచుకుంటూ వచ్చి అక్కడఉన్న ఆహరం తిని ఎప్పటిలాగూటిలోనికి వెళ్ళి నిద్రపోసాగింది సోమరికాకిపిల్ల. ఒకరోజు ఆహరంకొరకు పిట్టగోడపై నడచివెళుతున్నకాకిపిల్లనుచూసినపిల్లి వేగంగాపరుగుతీస్తూ కాకాదగ్గరకు రాసాగిందిపిల్లి. పిల్లినిచూసినకాకిపిల్ల ఎగరడంనేర్వనికారణంగా వేగంగానడవసాగింది.ఒక్కఉదుటున కాకిపిల్లగొంతుపట్టుకు కొరికి చంపిందిపిల్లి. ఎగరడం సహజంగా తనకుఅబ్బేవిద్యఅయినప్పటికి సోమరితనానికి అలవడ్డ కాకిపిల్లఅలా ప్రాణాలుకోల్పోయింది.బాలలు విన్నారుగా కథ సోమరితనం ఎంతప్రమాదకరమోకనుక.మీరు ఎన్నడూ సోమరితనానికిలోనుకావద్దు        మీ సహజత్వాన్ని విడనాడవద్దు"అన్నాడు తాతయ్య. బుద్దిగా తలలుఊపారుపిల్లలుఅందరు.