రామయ్య పాలెంలో భీమయ్య అనే ఒక విద్యార్థి చదువు చదువుతూ అతడు నిరుపేదలకు సేవ చేస్తూ జీవనం గడపసాగాడు. కాలనీలో నడవగా అందరూ పెళ్లిళ్లు కార్యాలు ఉంటే జరిగినప్పుడు అన్నం మిగిలిపోతే వృధాగా పాడుచేస్తూ ఉండేవారు. అప్పుడు అతనిదే ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తను తన ఊర్లో అందరికీ తన ఆశ్రమం పేరు మీద విజిటింగ్ కార్డు తయారు చేసి అది ఫంక్షన్ లు చేసుకునే వారికి ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఇలా చేస్తూ ఉండగా అనేక మంది పెళ్లిళ్లు కార్యాలు అయ్యే మిగిలినవి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి తన నగరం యాచకులకు మరియు నిరుపేదలకు వడ్డించడం చూస్తూ కొనసాగాడు.
ఇలా సాగుతూ ఉండగానే అనుకోకుండా మా ఊరికి ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయాధిపతి శ్రీ ఈరుకయ్య రెడ్డి వచ్చి అతని కోసం తెలుసుకుని అర్ధరాత్రి ఆకలితో ఉండడం ఉంటే ఆ రోజు వారు పెట్టిన అన్నం తినే మురిసిపోయే పదిమందికి చేసిన సేవకు ఆ న్యాయాధిపతి గారు వారిపై గవర్నమెంట్ చెప్పి ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చి భవంతి కట్టించి అందులో అనాధ ఆశ్రయం కల్పించే పని చేశాడు.
రోడ్డుమీద యాచకులు లేకుండా ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని ఆకాంక్షిస్తూ తెలిపినందుకు భీమయ్య సంతోషించి ఆనాటి నుండి పది మందికి ఆకలి తీర్చిన దేవుడి గా మిగిలాడు. కాబట్టి మన వద్ద మిగిలినది ప్రక్క వానికి అది పెడితే దేవునికి చేసిన సాయం తో సమానం అని తెలుసుకొనవచ్చును అనే గ్రహించవచ్చును.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి