తిప్పతీగ ( Tinospora Cordfolia) - 1 దివ్య ఔషధం..: పి .కమలాకర్ రావు



  తిప్పతీగ  భగవంతుడు  మానవాళికి  ప్రసాదించిన  ఒక దివ్యమైన ఔషధ మొక్క. దీనికి అమృతవల్లి , గుడూచి అనీ సంస్కృతంలో  పేరుంది. గిలోయ్ అని మరొక పేరు. ఇది చాలా పొడవుగా పెరిగే తీగ జాతి మొక్క. ఇది ఒక ఔషధాల గని. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.

 ఇది దేహంలోని  వాత పిత్త కఫ  సంబంధిత వ్యాధులను  తగ్గిస్తుంది . ఈ మూలిక కొద్దిగా చేదు రుచి కలిగి ఉంటుంది. దీని రసం జిగురుగా ఉంటుంది. జఠర రసాల ఉత్పత్తి కి  జీర్ణప్రక్రియకు  ఎంతో సహాయపడుతుంది. ఇది రక్తదోషాలను సవరిస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులను రాకుండా  కాపాడుతుంది.  సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ క్రిములను చంపేస్తుంది. అందువలన  కరోనా నుండి కాపాడుకోవడానికి  తిప్పతీగ ను  తప్పనిసరిగా  అందరూ వాడాలని ఆయుర్వేద వైద్యులు పదే పదే చెబుతున్నారు. స్వతహాగా తిప్పతీగ రసానికి  జ్వరాన్ని తగ్గించే గుణం ఉంది.

 కొన్ని తిప్పతీగ కాడలను  సేకరించి  శుభ్రంగా కడిగి బాగా నలగ్గొట్టి  నీటిలో వేసి మరిగించాలి. అందులో కొద్దిగా  పిప్పళ్ళ పొడి కూడా వేయాలి. చల్లారిన తర్వాత  తేనె కలిపి  కషాయం త్రాగాలి. దీనితో దగ్గు జలుబు జ్వరం తగ్గిపోతుంది. వరుసగా కొన్నాళ్ళు వాడాలి. దీని కషాయం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. తిప్పతీగ ఆకులను,  మరియు కాడల నుండి తయారైన  తిప్పసత్తు ను కూడా అవసరంగా వాడవచ్చు.


కామెంట్‌లు