ఉగాది పండుగ వచ్చెను
ప్రకృతియే పరవశించెను
తెలుగు సంవత్సరమనియు
సంబురాలన్నొ తెచ్చెను
గోధుమపిండే నాన్నను
అమ్మ తెమ్మని చెప్పెను
శనగపప్పు బెల్లం కలిపి
పూర్ణమును చేసి పెట్టెను
పిండిమిశ్రమంచేసెను
దానితో ముద్దలుచేసెను
అందులోపూర్ణము పెట్టి
భక్ష్యాలనన్నిచేసెను
అందరము కూర్చున్నాము
పచ్చడినే తాగినాము
పంచాంగశ్రవణముచేసి
సంతోషంగా గడిపాము
ప్లవనామ వత్సరమొచ్చె
వసంతాన్ని వెంట తెచ్చె
వ్యవసాయదారులకేమొ
పుష్కలంగ నీళ్లుదెచ్చె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి