తాతయ్య కబుర్లు-12.:- ఎన్నవెళ్లి రాజమౌళి


  పిల్లలూ! ఈత కొట్టుడు మంచి వ్యాయామమే.. కానీ, ఈత రానిది చెరువు, బావుల కాడికి పోవడం సరైనది కాదు. చెరువు దగ్గరకో, బావి దగ్గరకో ఈత కొడతానని వెడతారు. అక్కడికి వెళ్ళిన తరవాత ఇంకా కొంచెం లోనికి, ఇంకా కొంచం లోనికి అని నీళ్ళలోకి వెళతారు. మునిగిపోతున్న మిత్రుడిని సూచి రక్షించడానికి అని ఒకరు, ఇద్దరూ, ముగ్గురు ఇలా ఆరుగురు వరకు చనిపోయిన విషయాలు పేపర్లలో చూశాము. పుంటి కట్టెల ద్వారానైనా, సొరకాయ బుర్ర ద్వారానైనా ఈత నేర్చుకోవాలి. ఇవి వీపు కట్టుకున్నా... ఈత వచ్చిన వారు వెంబడి ఉండాలి. ఇలా ఈత వచ్చిన తర్వాతనే చెరువు కో, బావి కో వెళ్లాలి. అమ్మానాన్నలను కాదని ఈత రాని వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళవద్దు. వాళ్లకు బాధ కలిగించవద్దు. ఈ తాతయ్య మాటలు వింటారు కదూ!