తాతయ్య కబుర్లు-13. - ఎన్నవెళ్లి రాజమౌళి


 పదేళ్లు దాటకుండా... కొడుకు బైక్ నడపాలని తల్లిదండ్రులకు సరదా... కొడుకు కూడా తల్లిదండ్రుల ముందు బైక్ నడిపి చూపాలని సరదా. సరదా బాగానే ఉంది కానీ, వయసు కూడా చూడాలి కదా. ముందు సైకిలు నడపగా చూడాలి. సైకిల్ నడపడం వలన, ఎదిగే వయసులో వ్యాయామం చేసినట్టు కూడా ఉంటుంది. సైకిల్ నడిపిన అనుభవం తర్వాత తర్వాత బైక్ నడపడానికి ఉపయోగపడుతుంది. చిన్న వయసులో బైకు నడిపిన పిల్లలు, లేక వాళ్ల ద్వారా ఇంకెవరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. ఇది కాక, కాలు చేయి విరిగిన పిల్లల్ని కూడా చూసాం కదా! ఇవి చూసి జాగ్రత్త పడకపోవడం తప్పు కాదా!

కామెంట్‌లు