పిల్లలూ! అమ్మ కొట్టిందని... నాన్న తిట్టాడని.... టీచరు కొట్టాడని-చిన్న చిన్న విషయాలకు తట్టు కుంట లేరు నేటి బాలలు. అల్లరి చేసినప్పుడు... చక్కగా చదువకున్నప్పుడు... ఒక దెబ్బ వేయడం-మాట అనడం సహజమే కదా! ఈ మాత్రానికి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. మన పొరపాటుకి దండిం చారని, మళ్లీ ఆ పొరపాటు చేయకూడదు అనుకోవాలి కదా! మల్లెతీగ వంకరటింకరగా పందిరి పైకి పాకుతూ ఉంటే... గుంజ పాతి ఆ గుంజకు తీగను కట్టరా... అప్పుడే కదా.. ఆ తీగ చక్కగా పైకి పాకేది. అల్లరి పిల్లలకు సహజం. చెప్పినట్టు వినకపోవడం సహజం. తల్లిదండ్రులు-గురువులు మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది కూడా రేపటికి ఒక జ్ఞాపకమే.. అనుకోవాలి గానీ, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించవద్దు.
తాతయ్య కబుర్లు_15.- ఎన్నవెళ్లి రాజమౌళి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి