గుడ్మార్నింగ్ (199 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'సౌకర్యంగా బ్రతకడానికి, పరిమిత సంపాదన చాలు'
అని - లేదా , ఆ అర్థం వచ్చే కొటేషన్ ఏదైనా రాయగానే ,ఎవరో ఒకరు దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైనా రాస్తూ ఉంటారు! కొందరు మర్యాదగా రాస్తే,కొందరు కోపంగా రాస్తారు!అయితే ఇటువంటి వారు అరుదుగా ఉంటారు!
సాధారణంగా నా గురించి కొద్దో గొప్పో తెలిసిన వారు ఏమీ అనరు కానీ, ఎప్పటికప్పుడు కొత్తగా పరిచయం అయ్యేవారిలోనే ,ఇలాంటి వారు కొందరు ఉంటారు!
ఒకప్పుడు ఒక మిత్రుడు అయితే, కోపంగా కామెంట్ చేసాడు. చాలా కాలం మాట్లాడలేదు. అతని వాదన ఏమిటి అంటే? ఈ రోజుల్లో సౌకర్యంగా బ్రతకడం అంటే 
మీ స్టాండర్డ్స్ ఏమిటి -అవి ఎవరు నిర్ణయిస్తారు ?
రేపు ఏదైనా అయితే ఎవరు పూచీ? వగైరా ప్రశ్నలు వేసాడు! మన మైండ్ సెట్ అలా చెయ్యబడింది.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారికి చెప్పవచ్చు కానీ, వ్యతిరేకించే వారికి - సంపాదన అనే ఉన్మాదంతో ఉన్నవారికి చెప్పలేం- చెప్పి ఒప్పించలేం! అతను విపరీతంగా ఆస్తులు పోగెయ్యడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.అతను ఈ తరానికి చెందిన అనేక మందికి ఓ నమూనా!
అతని వంటి వారిని - అటువంటి ఆపేక్షలు కలవారిని
వారి ఫెయిల్యూర్స్ ను, నా ముందు గ్రామీణ సమాజపు మనుషుల్లో చూసాను. పారిశ్రామిక ప్రాంతంలో చూసాను. ఓ మూడువేల యేండ్ల చరిత్ర ఎలా గడిచిందో- ఆ చరిత్రకు నాయకత్వం వహించిన ఆ వేల లక్షల రాజవంశాలు ఏమయ్యాయో చదువుకున్నాను. 
ఇటీవల నాకు బాగా పరిచయం ఉన్న ఒకాయన నాకు ఫోన్ చేసి - నాకు మరింత బాగా తెలిసిన మరో మనిషి గురించి సమాచారం ఇచ్చాడు.ఇక్కడ గొల్లకొండలో ఏదో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడని- మనిషి మెంటల్ అయ్యాడని.  అతని నలబై సంవత్సరాల సంపాదనా పిచ్చి గుర్తుకు వచ్చింది. కొన్ని సందర్భాలలో చెప్పాను కూడా అతనికి! వెళ్ళి చూడాలని కూడా అనిపించలేదు నాకు!
సంపాదన అంటే ఏమిటి? ఎక్కడిది అది?? మన ఒక్కరిదేనా అది??? పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన తరువాత ,పెద్దపెద్ద పెన్షన్లు పొందుతూ, తిరిగి అడ్డదారుల్లో , ప్రభుత్వ పనులు దక్కించుకునేవారు ఎందరు లేరు? సమాజాన్ని దోచి దోచి,కుటుంబాలకు పెట్టడం, మన సమాజపు దుర్లక్షణం! దోపిడీ లక్షణం!
మన టీవీ కార్యక్రమాల్లో- వార్తాపత్రికల్లో అత్యధిక జీతాలు పొందుతున్న వారి గురించి ఆకర్షణీయమైన శైలిలో చెప్తుంటారు- రాస్తుంటారు! ప్రపంచ కుబేరుల గురించి ప్రతీ సంవత్సరం లిస్ట్ ఒకటి విడుదల చేస్తూ ఉంటారు. దాని మీద ప్రపంచానికి ఎంతో ఆసక్తి!
మొన్న మొన్నటి వరకు మనది భూస్వామ్య వ్యవస్థ!
ఆ వ్యవస్థ స్వభావం ఏమిటి అంటే 'భూదాహం'
ఎంత భూమి ఉన్నా , మరింత కావాలి!
కుటుంబ అవసరాలకు ఎంత భూమి కావాలి?
'మనిషికి కావలసిన నేల ఎంత?' అని రష్యన్ మహారచయిత లియో టాల్‌స్టాయ్ ఓ కథ రాసాడు! చదవాలి అందరూ!
భూదాహపు వ్యవస్థ ,క్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థగా పరిణమించింది! ఈ లక్షణం మనకు యూరోప్ నుండి విపరీతంగా వచ్చి చేరింది.పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్య లక్షణం'లాభాపేక్ష' ! అందుకు అధికోత్పత్తి- అనవసరంగా ,అధికంగా కొనిపించడం ,అదంతా ఓ విషవలయం! భూగోళాన్ని‌ సర్వనాశనం చేస్తున్నారు! సంపాదన అవసరమే కానీ, సంపాదనా పిచ్చి ప్రమాదకరం!
అధిక సంతానం గురించి ,దాని వల్ల కలిగే అనర్ధాల గురించి ఇప్పుడు చర్చ ఎందుకు లేదు? జనాభా ఎంత పెరిగితే, పర్యావరణానికి అంత హాని!
తెలంగాణ సమాజంలో ఓ సామెత ఉంది!
'పాచి పళ్లోడు సంపాయిస్తే , బంగారు పళ్లోడు ఓడగాసే' అని! ఓడగాయడం అంటే? ఖర్చు పెట్టడం అని అర్థం!
పాచి పళ్లవాడు అంటే? తినకుండా తాగకుండా,మంచి బట్ట కట్టకుండా, సౌకర్యవంతమైన ఓ ఇల్లు కూడా కట్టుకోకుండా,పిసినారి తనంతో ,ధన సంపాదనకు ఎగబడేవారిని ,తరువాత ఏ పనీ చేయకుండా,ఆ ధనాన్ని ఖర్చు చేస్తూ, ఉన్న ఆస్తులను అమ్మి‌ తిని చెడిన ,
వారి సంతానాన్ని చూసి , ఎవరో ఆ సామెతను కట్టి ఉంటారు. తల్లిదండ్రులు ఎక్కువ సంపాదించి పెడితే, పిల్లల్లో సోమరితనం పెరుగుతుంది!
సంతానానికి విపరీతంగా ఆస్తులు ఇచ్చేవారు, వారిని ఎందుకూ పనికిరాని వారిగా చేస్తారు!
ఓ ఇల్లు సరిపోతుంది- రెండో ఇల్లు అనవసరం!
ఒకరో ఇద్దరో పిల్లలు, వారిని చదివిస్తే చాలు. వాళ్ల బ్రతుకు వాళ్లు  బ్రతుకుతారు! పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి.
మనిషికో కారు,పర్యావరణ ప్రమాదకారి!
రిటైర్మెంట్ లైఫ్ గురించి ఓ సామాన్యమైన ప్లాన్ ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అనవసరమైన ఆపేక్షకు నిదర్శనం! దాన్ని దోపిడీ అనాలి!అధిక సంపాదన, దోపిడీతో సమానం!
అతి తక్కువ వనరులతో బ్రతకడం, అత్యుత్తమ జీవనవిధానం! అది మనకూ సమాజానికీ పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఆ దృక్పథం మన భవిష్యత్తరాలకు బ్రతుకు తెరువును చూపిస్తుంది!
'సంపాదనా కళ ' గురించి ,మనం తెలుసుకున్నట్టుగానే,దాని విరమణ కళ గురించి కూడా తెలుసుకోవాలి!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం