తాతయ్య కబుర్లు-6.:- ఎన్నవెళ్లి రాజమౌళి

 పిల్లలూ! ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా! ఆ భాగ్యం కావాలంటే.... ఆటలు లు-వ్యాయామం ఎంతో అవసరం. ముఖ్యంగా బాలలు మాత్రం చదువుతోపాటు ఆటలు కూడా ఆడాలి. చదువు ముఖ్యం కానీ, ఆటలు లేకుంటే ఏం? అనుకున్నారట. మహాత్మా గాంధీజీ. తన జీవిత చరిత్రలో నేను చిన్నప్పుడు ఆటలు ఆడక పొరపాటు చేశానని, రాసుకున్నారు. మానసికంగా ఎదగడానికి చదువు ఎంత ముఖ్యమో... ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు అంతే ముఖ్యము. ఆకలి-దప్పిక లు కూడా ఆటలు ఆడితేనే బాగుంటాయి. మంచిగా చదువుకోవాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలి కదా!