కందము :
*గోపాల దొంగ మురహర*
*పాపాలను పారఁద్రోలు | ప్రభుఁడవు నీవే*
*గోపాలమూర్తి దయతో*
*నా పాలిట గలిగి బ్రోవు | నమ్మతి కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
స్వర్గమును పాలించువాడా, గోపాలక అవతారములో వున్నవాడా, మాయలు చేసే/చూపే వాడా, ముర అను రాక్షసుని చంపి కాపాడావు. మనుషులు చేసే పాపాలన్నీ తొలగించేవాడివి నీవే. నీవే నాప్రభువు. నిన్నే నమ్మి వున్నాను నృసింహా. నీవు నాయందు వుండి నన్ను కాపాడు, కంసారీ.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*" సర్వ జగత్తు కు ఆధారభూతుడవై వున్నావు. ఈ పాంచేద్రియ ప్రపంచంలో జరిగే అకృత్యాలను అన్నిటినీ తొలగించే వాడివి నీవే. నిన్నే నమ్మి వున్నాము, రాధికా కృష్ణా. ఆలస్యము చేయకుండా మమ్మల్ని నీ సాయుజ్యానికి చేర్చుకో, నందకుమారా!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి