కందము :
*ఓ భవబంధ విమోచన*
*ఓ భరతాగ్రజ మురారి | యో రఘురామా*
*ఓ భక్త కామధేనువ*
*ఓ భయహర నన్ను గావు | మో హరి కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
నీవు భరతునికి అన్నవు. నీవు రఘువంశములో పుట్టిన రఘురాముడివి. నీవు ఈ భూమి మీద వున్న బంధాలను అన్నిటిని తొలగించేవాడివి, నువ్వే కదా. నువ్వు అన్ని భయాలను పోగొట్టే వాడివి. నీ భక్తులకు కోరిన కోరికలు తీర్చే కామధేనువు వంటి వాడివి. ఇటువంటి రామచంద్రా, నా అన్ని భయాలను పోగొట్టి నన్ను నీ వాడిగా చేసికొని, కాపాడు పరంధామా! శ్రీ కృష్ణా!! .....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*రామచంద్రా, రఘుకులతిలకా. నీ నామం "రామ" అని పలికితేనే అన్ని కష్టాలను తొలగిస్తావు. నీ పేరు ఒక్కసారి పలికితే వేయి సార్లు పరమాత్మ నామం, పంచాక్షరీ, అష్టాక్షరీ పలికినంత ఫలితం ఇస్తావు కదా స్వామి. "శ్రీ రామ రామ రామేతి! రమే రామే మనోరమే!! సహస్ర నామ తత్తుల్యం!!! రామ నామ వరాననే!!!!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి