*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౫ - 75)

 కందము :
*ఏ తండ్రి కనకకస్యపు*
*ఘాతకుఁడై యతని సుతుని| కరుణను గాచెన్*
*బ్రీతి సురకోటి బొగడఁగ*
*నా తండ్రీ! నిన్ను నేను | నమ్మితి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుని కన్న తండ్రి లాగా కాపాడి,  దేవతలు ల, రుషులు, మునులు, యక్షులు, కిన్నెరలు పొగడగా నరసింహుడవై హిరణ్యకశిపుని  చంపావు కదా రాక్షసాంతకుడవై.  అదేవిధంగా, కరుణ జూపి నన్ను కూడా కాపాడు తండ్రీ.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ఎన్నో కష్టాలకు ఓర్చి, నిన్నే నమ్మి, నీ మీద నుంచి దృష్టి మరలకుండా, అహరహమూ నీ తోనే వున్న ప్రహ్లాదుని, తండ్రి లాగా కాపాడావు కదా, కనకహరిణి సంహారా.  మాయలను సృష్టి చేసి, మానవులను ఆ మాయా మోహితులను జేసి, మళ్ళీ ఆ మాయను నీవే తొలగించి, అంతా మాయే అని చెప్తావు, పరాత్పరా.  నీ మాయలను తెలుసుకోవడం, నారద సహాయం వున్న ప్రహ్లాదునికి చెల్లింది కానీ, మా వల్ల కాదు కదా! జగదోద్ధారకా!!  నీవే మా యందు కరుణ జూపి మమ్మల్ని ఉద్ధరించు, ఉద్ధవమిత్రా! "కరుణజూడు. నిను నమ్మిన వాడ గదా! అంబా! కరుణ జూడు నిను నమ్మిన వాడ గదా!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు