కందము :
*ఆ దండకా వనంబున*
*కోదండము దాల్చినట్టి | కోమలమూర్తీ*
*నాదండఁ గావ రమ్మీ*
*వేదండము కాచినట్టి | వేలుప కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
పువ్వుల వలే మెత్తనైన శరీరము కలవాడివైన కృష్ణా, ఎంతో దట్టమైన దండకము అనే అరణ్యం లో ఎంతో గొప్పదైన నీ కోదండాన్ని ధరించి, లెక్కలేనన్ని కృూర మృగాలను సంహరిచి మునులను, యోగులను కాపాడావు. గజరాజును కాపాడడానికి వైకుంఠము నుండి పరుగు పరుగు న వచ్చావు. అంతటి మహారాజువి, మహిమ గలవాడివి నా పక్కన వుండి నన్ను కాపాడు రాధాశ్యామా . .....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*లాక్షా గృహంలో వున్న పాండవులు అగ్ని బారిని పడకుండా కాపాడావు. విరాట రాజు కొలువులో సంవత్సర కాలంపాటు పాండవులచేత అజ్ఞాతవాసం జగజ్జేయంగా చేయంచావు. చిన్నతనం లోనే పూతనను మట్టు బెట్టావు. ఇంతటి నీకు, నన్ను కాపాడడం అనేది పెద్దపనా కన్నయ్యా! ఎప్పటకీ కాదుకదా! నా యందు దయవుంచి నా చెంతకు వచ్చి, నన్ను నీ అక్కున చేర్చుకో, పన్నగశాయీ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి