స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-: రామానుజం. ప. : 8500630543.

 🍀నూతన   తెలుగు  సంవత్సరాది 🌿  
          🌺 ఉగాది   శుభాకాంక్షలు 🍊
     
56)
శ్రీ  ప్లవ  నామ ఉగాది ని  ,
దీపములతొ  స్వాగతించు   దినమీ నాడే  !
తీపి, వగరు, చేదు, పులుపు,
ఉప్పును, కారము ల ష డ్రుచులతో  మెచ్చన్  !!

57)
ఔషధ  గుణములు  పొందియు  ,
ఉషోదయాన  పరిశుభ్రముగ  పచ్చడి  తోన్  ;
పుష్టైన  పిండి వంటలు  ,
ఇష్టముగా    చేసికొంచు    నైవేద్యమిడున్   !!

58)
తెలుగిండ్లను   తప్పనిసరి  ,
తొలి వేడుకగా, ఉగాది తెచ్చును శుభముల్ ;
పలు కార్యక్రమాలు    జరిగి  ,
భలే , భళీ  యంచు  మోద భరిత మ్మగునే   !!

59)
శార్వరి  వెడలుచు  , ప్లవ యును
వార్షిక      ఫలితాలతోడ   శోభను   తెచ్చున్   ;
ఈ  రోజున  పంచాంగం. ..
పేరు బలము, ఏరువాక   ఫలితం  తెల్పున్   !!

60)
ఆకాంక్షింతుము  ,    లోకము
సంకటస్థితి  వీడి  , క్షేమ, స్థైర్యము  లొందన్  ;
లోకుల   సాధారణ  స్థితి...
శక్తియు, నడవడియు,వ్యక్తి శ్రధ్ధయె తెచ్చున్  !!
కామెంట్‌లు