స్ఫూర్తి -- శక్తి..... కందాలు-- రామానుజం. ప.-- జేబులో : 8500630543.
 66)
అరువది  సెకెనులు  నిముషము  ,
అరువది  నిముషాలు గంట
                         అగుచును యుండున్  ;
ఇరువది   నాలుగు  గంటలు
ఓ   రోజు గయై   సకాల సమయం  తెల్పున్  !!
67)
నెలరోజులు   మా సమనియు  ,
నెలలే   పన్నెండు  గూడి , ఏడాది యగున్  ;
నాల్గో  యేటను  ' లీప'ని   ,
పిలుతురు,ఒకరోజు హెచ్చు ఫిబ్రవరి యగున్ !!
68)
నెలలో   రెండే  పక్షములు  ,
నెలలో  అమవాస, పౌర్ణ  మేర్పడు చుండున్  ;
నెలలో   ముప్పది  రోజులు  ,
తెలుగు  నెలల సంఖ్య
                  అధిక  మగుచును  యుండున్  !!
69)
వారాలు    నాల్గు  వచ్చును  ,
ఇరువది  యేడుగ ను తార లిలలో  గలవే   ;
పండ్రెండు  నెలలు   చొప్పున  ,
అరువది సంవత్సరములు తెల్గున  యుండున్!
70)
ఋతువులు  ఆరును  , నడుపును
ఋతు   పవనములతొ,
                     ధరణిని  , ఋజుమార్గమునన్  ;
శీతోష్ణస్థితుల  ,  జీవుల
సంతస మేర్పర్చి ప్రోత్సహించుచు  నుండున్ !!