*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౮౬ - 86)

 కందము :
*అప్పా ఇత్తువు దయతో*
*నప్పాలను నతిరసంబు | ననుభవశాలీ*
*యప్పా నను గనుగొనవే*
*యప్పా ననుబ్రోవు వేంక | టప్పా కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
వేంకటరమణుడవు అయిన తండ్రీ, ను భక్తలను రక్షించుట యందు అనుభవము వున్నవాడివి.  నీవు తినే తియ్యని అప్ఫాలు, అరిసెలు మాకు ఎంతో దయతో యిస్తావు.  కన్న తండ్రి లాగా మమ్మల్ని దయతో కాపాడు, రమాధవా! ....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*కృష్ణా, ఈ భూమి మీద కలియుగం లో పాపాలను నశింప చేయడానికి వేంకటేశ్వరునిగా వెలసిన ఓ పరాత్పరా, కృష్ణా!  మేము చేసిన తప్పులను లెక్కించకుండా, మా నుండి మొక్కులను ముక్కుపిండి వసూలు చేసుకుని మరీ, మాకు తియ్యని అప్పాలు, అరిసెలు తినిపిస్తావు కదా, కన్న తండ్రి లాగా.  వేంకటరమణా, సంకటరమణా, నీ దయ, కరుణ మా మీద చూపించి మమ్మల్ని ఉద్ధరించు, శ్రీనివాసా! .*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss