ఆనందంగా పాటలు పాడుకుంటూ నందుడు మేకలను టోలుకుంటూ వెళుతున్నాడు. అలా కొంతదూరం వెళ్ళాక చిన్నచిట్టడివి వచ్చింది. అక్కడ పచ్చని చెట్లు మంచి గాలి వాసన, చిత్రంగా నేల వాసన ఎంతో ఆహ్లదకరంగా ఉన్నాయి. ఆ అందమయిన ప్రకృతికి పులకించి నందుడు పరవసిస్తూ మంచి రాగాన్ని అందుకున్నాడు.
ఆ మేకల గుంపులోని ఒక చిలిపి మేకకు పచ్చని చెట్లున్న ఆ అడవిని చూసే సరికి ఆ అడవిలోకి వెళ్లి రుచికరమైన ఆకులు,లేత తీగలు తినాలనిపించింది, నందుడు పాట పారవశ్యంలో ఉండగా ఆ చిలిపి మేక మందనుండి వేరుపడి గుబురుగా ఉన్న అడవి చెట్లలోకి వెళ్ళిపోయింది.
అలా అది రుచికరమైన చెట్ల ఆకులు తింటూ,ఇంకా అడవి లోపల ఉన్న అనేక రకాలైన రుచికరమైన చెట్లు తినవచ్చు అనుకుంటూ చాలా దూరం వెళ్ళొపోయింది.
చెట్ల మధ్య అది ఒక వింత దృశ్యం చూసింది. పాపం ఒక కృష్ణజింక కొమ్ములు దళసరిగా ఉన్న తీగల మధ్య ఇరుక్కపోయివున్నాయి.
ఎందుకంటే ఆ తీగఆకులు రుచిగా ఉంటాయి. వాటిని తింటున్నప్పుడు ఆ తీగల మధ్య దాని కొమ్ములు ఇరుక్కపోయాయి! మరి ఎంత ప్రయత్నించినా కొమ్ములు తీగలనుండి విడిపించుకోవడం కష్టంగా ఉంది.
దానికి అడవిలోకి వస్తున్న మేక కనిపించింది.కృష్ణజింకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.
మేకను పిలిచి అది"మేక మామ,మేక మామ నాకు చిన్న సహాయం చెయ్యి, ఈ తీగల్లో నాకొమ్ములు ఇరుక్కున్నాయి, నీవు కొన్ని ఆకులు తిని కొన్ని తీగల్ని కొరికితే నా కొమ్ములు సులభంగా బయటికి వస్తాయి,దయచేసి ఈ చిన్న సహాయం చెయ్యి" అని వేడుకుంది.
"నేను తొందరగా వెళ్ళాలి, నీకు సహాయం చేస్తూ కూర్చుంటే, ముందర దొరికే రుచికరమైన ఆకులు నాకు దక్కవు"అని పొగరుగా చెప్పి ముందుకు వెళ్ళింది.
"మరీ లోపలికి వెళ్లకు ప్రమాదం" అని హెచ్చరించింది కృష్ణ జింక.
అయినా చిలిపి మేక దాని మాట వినకుండా కొంత దూరం అడవిలోకి వెళ్ళింది. ఈ లోపల కృష్ణ జింక అతికష్టం మీద తీగలనుండి కొమ్ములు విడిపించుకుంది! అది వేగంగా మేక వెళ్లిన వైపు వెళ్ళింది.
మేక రకరకాల ఆకులు తింటూ కనబడింది!
మేక వద్దకు పరుగున వెళ్లి కృష్ణ జింక ఈ విధంగా చెప్పింది"చూడు మేక మామ చీకటి పడబోతోంది,ఈ అడవిలో పులి అనే క్రూర జంతువు ఉంది. నీవు దానిని తప్పించుకోలేవు అది అతి వేగంగా పరుగెత్తి నిన్ను పట్టుకుని చంపి తింటుంది, అందుకని వచ్చిన దారిలోనే వేగంగా వెనక్కు వెళ్లిపో,నా మాట విను నీ మేలుకోరి చెబుతున్నాను." అని చెప్పింది.
"నేను సహాయం చెయ్యక పోయినా ఈ జింక నావద్దకు వచ్చి నన్ను పులి వాత పడకుండా కాపాడింది,జింకది గొప్ప మనసు, నిజానికి జింకకు సహాయం చేసివుండాల్సింది.తిండి మీద మోజుతో ఎంత చెడ్డగా ప్రవర్తించాను, ఎప్పుడు కానీ ఎవరైనా ఆపదలోఉన్నప్పుడు మనకు చేతనైనంత సహాయం చెయ్యాలి కదా!" అని ఆలోచించి బాధ పడింది.
అది పరుగున వెళ్లి దూరంగా వెళుతున్న నందుడు మేకల గుంపులో చేరి,ఇకమీదట గుంపు వదలి వెళ్లకూడదని, తెలియని చోటుకి వెళితే ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలుసుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి