అదిగో వస్తుంది ఉగాది
ఇదిగో వేస్తుంది పునాది
ఇది నవ జగతికి నాంది
కాకూడదని ఏముంది?
ముదితల్ లార లేవండి
ముగ్గులు ముంగిట పెట్టండి
మీరు తోరణాలను కట్టండి
నుదుటన తిలకం పెట్టండి!
విన్నారా తరుణు లారా
కన్నా రా రుచుల జాడ
ఇంకా చూస్తారు ఎందుకు?
అందరిని పిలవండి విందుకు.
లేత మావి చిగురు తిన్న గండు
కోయిలమ్మ కోరి కోరి కూస్తున్నది
మంగళ శ్రీకర గీతాలాపన తాను
మరీ మరీ ఏరికోరి చేస్తున్నది !
పచ్చని పచ్చడి పంచండి
వెచ్చని హారతి ఇవ్వండి
ఉగాది కాంత వస్తున్నది
జగాన కాంతి పూస్తున్నది !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి