నీతి పద్యాలు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.-మొబైల్: 9908554535.

 94. ఆ.వె. బాల బాలికలను బాగుగా కొట్టినా
               చదువు రాదు తనువు ఝల్లుమనును
               మూల మరసి విద్య మురిపముతో చెప్పు
               రమ్య సూక్తులరయు రామకృష్ణ .
95. ఆ.వె. ఇంటి ముందు చెట్టు నితరుల సొమ్మేను
                పూలు తెంపుదురుగ   పూజ కొరకు 
                నింటివారి నడుగ నిష్టపడరు వారు
                రమ్య సూక్తులరయు  రామకృష్ణ.
96. ఆ.వె.  ప్రతి నిముసము నీవు పైసాను తలవకు
                  రాగమందును అనురాగమందు
                  హద్దు లేకయున్న యాపదల్ కలుగవా
                  రమ్య సూక్తులరయు రామకృష్ణ.