ఒక్కటై నిలవండి:---తొగర్ల.సురేష్,ASI.
ఒక వైపు కరోనాతో జీవన పోరాటం
మరో వైపు మందు షాపులు తెరిచే ఆరాటం
ఒక వైపు కరోనా బాధితుల బతుకు పోరాటం
మరో వైపు మందు బాబుల బాటిల్ల ఆరాటం
ఒక వైపు భార్యా బిడ్డల ఆకలి కేకల పోరాటం
మరో వైపు మండు టెండలో
మందుకై ఆరాటం
ఒక వైపు జులాయిల నియంత్రణ పోలీస్ పోరాటం
మరో వైపు బరితెగించిన సారా బాబుల ఆరాటం
ఒక వైపు పాలకుల ఉచిత నిధికై పోరాటం
మరో వైపు ఇచ్చిన సొమ్మును
వృధా చేసే ఆరాటం
*ఇలా
కాయా కష్టం చేసి దాచిన సొమ్మొక వైపు
తాగి తందాన లాడే మధు ప్రియు లొక వైపు
నలుపది రోజుల కట్టడంతా
నాలుగు గంటల్లో ఆవిరై పోయే
ఎవరిదీ తప్పని ప్రశ్నిస్తే
అందరూ భుజాలు తుడుము కునే వారే
తప్పు మీదంటే మీదని
ఒకరిమీదఒకరు నిందారోపణలే
సోదరు లా

రా ఇకనైనా మారండి
ఇకనైనా కన్నులు తెరవండి
క్రమ శిక్షణ అలవర్చుకొని
కరోనాను ఖతం చేయగ
కల్సి నడుద్దాం రండీ
కల్సి పోరాడుదాం రారండి.
                 ********