ప్రకృతిమాత ఘోష (బాల గేయం):--ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
ధరణి మీద చూడగా
తరువు లే కరువాయే
పశుపక్ష్యాదులకు
నిలువనీడ లేదాయె

లోకమంత కాలుష్యం
గుట్టలోలె పేరుకు పోయి
ఎటు చూసినా గాని
దుమ్ము ధూళి నిండిపోయె

ధరణి తల్లి చూడగా
ఎడారిగా మారుతుంది
ఎందుకో ఈ తరుణం
ఎందరెందరికో మరణం

ఎవరో చేసిన నేరం
ఎందుకింత ఘోరం
ప్రకృతిమాత ఘోష
పట్టదా మరి ఎవరికి


కామెంట్‌లు